Sunday, 11 September 2016

Creating a blog

Blog Creating tips in Telugu
1.  https://www.blogger.com/ ఓపెన్ చేయండి.



2

Creating a blog

Blog Creating tips in Telugu
1.  https://www.blogger.com/ ఓపెన్ చేయండి.



Saturday, 10 September 2016

Few Telugu samethalu

 కొన్ని తెలుగు సామెతలు

  • అంధునికి అద్దం చూపినట్లు 
  • ఇంటి పిల్లికి పొరుగు పిల్లి తోడు 
  • ఎంచబోతే మంచమంతా కలతలే. 
  • ఏ ఎండకు ఆ గొడుగు,ఏ గాలికి ఆ చాప.  
  • ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు. 
  • కాచే చెట్టుకే రాళ్ల దెబ్బలు . 
  • గుర్రం గుడ్డిదైనా దాణా తప్పదు. 
  • చందమామను చూసి కుక్కలు మొరిగినట్లు. 
  • తలపాగ చుట్టటం రాక తల వంకరన్నట్లు. 
  • తాను వలచింది రంభ, తా వలునిగింది గంగ. 


Cool Drinks affect on Human

కూల్ డ్రింక్స్ తో శరీరం చల్లబడుతుందా ?

చల్లని పానీయాలు వేసవిలో ఉపశమనం కలగజేస్తాయని అపోహతో మనం కూల్ డ్రింక్స్ తాగుతుంటాం. చాలామంది దాహం తీరుతుందని నీటికి బదులు తాగేస్తుంటారు. వాటిని తాగితే ఆరోగ్యము దెబ్బతింటుందని అధ్యాయనాల్లో రుజువైంది.
పిల్లల్లో వీటివల్ల ఊబకాయం (obsesity) వస్తుంది. చక్కెర వ్యాధి(డయాబెటిస్) వచ్చే అవకాశం ఉంది. కూల్ డ్రింక్స్ లో ఉండే ఫాస్ఫారిక్ ఆసిడ్ దంతాలపై ఉండే అనామిల్ ను దెబ్బతీస్తుంది.దీనివల్ల కాల్షియం మెటాబాలిజమ్ సైతం దెబ్బతిని ఎముకల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది. పైగా వీటిని నిల్వ ఉంచేందుకు వాడే రసాయనాల వల్ల మానసిక అనారోగ్యాలు పెరుగుతున్నాయట.
అందుకే కూల్ డ్రింక్స్ కి బదులు తాజా పళ్ళ రసాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవటం మేలు. ఒకవేళ కూల్ డ్రింక్స్ ఎపుడైనా తాగాల్సివచ్చినా తక్కువ పరిమితి లో తాగాలి 

Friday, 9 September 2016

Lip Care

 అందమైన  పెదవులకు  జాగ్రత్తలు

  • ప్రతిరోజు వెన్న, మీగడ,పెరుగు వీటిలో దేనినైనా  పెదవుల మీద రాసుకుంటే పెదవులు మృదువుగా ఉంటాయి. 
  • తక్కువ ధరకు లభించే, చవకబారు లిప్ స్టిక్  అసలు వాడొద్దు. పెదవుల్ని శుభ్రంగా కడుక్కున్నాకే లిప్ స్టిక్ రాసుకోవాలి. రాత్రి పడుకునే ముందు లిప్ స్టిక్ ని తొలిగించాలి. 
  • పెదవులకి పడకపోతే లిప్ స్టిక్ ని మానేయాలి. 
  • మసాజ్ చేయటం వల్ల పెదవులు పగలవు. పెదవుల చుట్టూ వేళ్ళతో నొక్కిపట్టి, వలయాలలా తిప్పుతూ మసాజ్ చేయవచ్చు. 
  •  వెజ్ లీన్ లేదా కోల్డ్ క్రీమ్, పేరుకున్న నెయ్యికానీ  రాస్తే పెదవులు పగలవు. 
  • వింటర్ (చలికాలం) లో లిప్ స్టిక్ తక్కువ వాడితే  మంచిది. 
if you want to write some beauty tips, contact us on the below link

Personality Development

వ్యక్తిగత విజయసిద్ధి (Personality Development)

  1. జీవితంలో సఫలురయిన చాలామంది స్త్రీ పురుషులు కళాశాలల్లో ఉన్నత విద్యలు అభ్యసించలేదు. వాళ్ళు "జీవితం అన్న పాఠశాల" లో మాత్రమే చదువుకున్నారు. 
  2. మిమ్మల్ని వెనక్కు లాగేది అపజయం కాదు. అపజయం పాలౌతామనే భయమే మిమ్మల్ని నిశ్చేష్టులను చేస్తున్నది. 
  3. జీవితంలో మీకేదైన కావాలనిపిస్తే అది పొందినవాళ్లు దాన్ని ఎలా సాధించారో తెలుసుకోండి. మీరు అలాగే సాధించండి 
  4. విజయానికి కావలసిన అత్యంత ముఖ్యమైన ముడిసరుకు- అపజయం నుంచే విజయం చేకూర్చుకునే మార్గాలు నేర్చుకోగలరు. 
  5. మీ మనస్సు కొత్త ఆలోచనను ఢీకోనప్పుడు మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. 
  6. మనస్సులో ఎల్లప్పుడు ఏది కావాలని కోరుకుంటారో, అది మీరు పొందగలరు
  7. మనశ్శాంతిని మీ అంతిమలక్ష్యంగా పెట్టుకోండి. దానిని సాధించడానికి మీ జీవితాన్ని వ్యవస్తీకరించండి. 
  8. మీ  అద్భుతమైన మెదడును మీరు సక్రమంగా ఉపయోగించుకుంటే అది మిమ్మల్ని దరిద్రం నుంచి ఐశ్వర్యంలోకి, ఒంటరితనం నుంచి ప్రఖ్యాతికీ, నిరాశ నిస్పృహల నుంచి ఆనందమయ జీవనానికి తీసుకోని వెళ్లగలదు. 
  9. ఒకే సమయం లో ఒకే విషయం పట్ల ఏకాగ్రత సాధించగల మీ సమర్ధతపై మీ విజయం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. 
  10. మీ మెదడును ఉపయోగించే రీతివల్ల అది మిమ్మల్ని పేదగానో లేదా ధనికుడినో చేస్తుంది. 

Thursday, 8 September 2016

Blood Group Percentage

జనాభా లో వివిధ బ్లడ్ గ్రూపులు శాతాల వారీగా

Blood Group Percentage of population
O+ 36%
A+
28%
B+ 21%
AB+ 5%
O- 4%
A- 4%
B- 1%
AB- 1%

Tookiga


టూకీగా
  • సేకరించిన రక్తం 42 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. 
  • ప్లేట్ లెట్లు 5 రోజులే నిల్వ ఉంటాయి. 
  • భారీ రోడ్డు ప్రమాదంలో గాయాలైతే, ఆ వ్యక్తి ప్రాణం నిలవాలంటే కనీసం 50 మంది రక్తదానం చేయాల్సి ఉంటుంది. 
  • ఒక వ్యక్తి చేసే రక్తదానంతో మూడు  నిండు ప్రాణాలు నిలిచే అవకాశం ఉంటుంది. 
  • ఒక పసికందు ప్రాణాలు కాపాడటానికి 3 టీ స్పూన్ల రక్తం చాలు. 
  • తీవ్రంగా కాలిన గాయాలకు గురైన వ్యక్తిని కాపాడాలంటే కనీసం 20 మంది రక్తదాతలు అవసరం. 

Raktam saranam gachami

రక్తం శరణం గచ్చామి 

ప్రపంచవ్యాప్తంగా వివిధ కారణాలవల్ల రక్తం అవసరమైనవారికి తగినంత దొరకటం లేదు.
రక్తం అవసరాలకు సంబంధించి కొన్ని వాస్తవాలు:

  • భారత్ లో ఏటా 1.20 కోట్ల యూనిట్లు రక్తం అవసరమవుతుంటే, రక్తదాతలనుండి సేకరిస్తుంది 90 లక్షల యూనిట్లు మాత్రమే.
  • ఒక యూనిట్ రక్తం తో మూడు నిండు ప్రాణాలు కాపాడవచ్చు. 
  • ఏ గ్రూపు రక్తం ఉన్న వారికైనా 'ఓ' నెగిటివ్ రక్తానికి చెందిన ఎర్ర కణాలను ఎక్కించవచ్చు. ఈ గ్రూపు రక్తానికి డిమాండు ఎక్కువ,  దీనికి తీవ్రమైన కొరత ఉంటోంది. 
  • అన్ని బ్లడ్ గ్రూపు ల వారికీ 'ఏబీ' పాజిటివ్ గ్రూపు వారికీ చెందిన ప్లాస్మాను ఎక్కించవచ్చు. దీనికి కూడా కొరత ఉంటోంది. 
  • రక్తదానం చేయాలనుకునే వారు రెండు నెలలకి ఒకసారి చేయవచ్చు. ఆరోగ్యానికి  ముప్పు ఉండదు. 
  • కేవలం ప్లేట్ లెట్లు ఇచ్చేవారు వారానికి ఒకసారి ఇవ్వచ్చు. 
  • పూర్తి ఆరోగ్యంతో ఉండి, 18-65 ఏళ్ల లోపు వారు రక్తదానం చేయవచ్చు. 

vantinti chitkaalu


వంటింటి  చిట్కాలు:                                                                                                                            
  1. నెయ్యి ఎక్కువకాలం తాజాగా ఉండాలంటే అది ఉంచిన గిన్నె లో చిన్న బెల్లం ముక్క ఉంచండి.  
  2. అరటి తొక్క తో  లెదర్ షూ ని పాలిష్ చేసి ఆపైన గుడ్డ  తో తుడిస్తె బాగా మెరుస్తాయి.
  3. కాసేపు వేడినీళ్ళల్లో ముంచిన కత్తిని  వాడితే  డ్రైఫ్రూట్స్  ని సులభంగా కట్ చేయవచ్చు. 
  4. చీరలు, షర్ట్ ల మీద జీగురు తో అంటించిన లేబుల్స్ తొలిగించాలంటే ఆ బట్టను వెనక్కి తిప్పి ఇస్త్రీ పెట్టెతో రుద్దితే సరిపోతుంది. 
  5. చిన్న అల్లం ముక్కని కానీ, కొబ్బరి ముక్కని కానీ మజ్జిగలో, పెరుగులో వేసి ఉంచితే పులవకుండా ఉంటాయి. 

Monday, 5 September 2016

Bangaru Matalu

బంగారు మాటలు

  1. ఎంత ఉన్నతమైన పదవిని అలంకరిస్తే అంత వినయంగా నడవాల్సి ఉంటుంది - సిసిరో  
  2. మనం చేయగల పని ఎవరో వచ్చి మనకోసం చేసిపెడతారు అని అనుకోవడమే మన జీవితపు ప్రధానమైన లేమి - ఎమర్సన్ 
  3. ప్రేమించబడడం కంటే విశ్వసించబడడం గొప్పది - జార్జ్ మెక్ డోనాల్డ్. 
  4. బాధపడేవారికి సేవ చేయడమే నిజమైన పూజ అవుతుంది - డా.ఎస్. రాధాకృష్ణన్ 
  5. పెద్ద పనులు చేయడానికి కాచుకుని కూర్చున్న వ్యక్తి ఏ పని చేయలేడు- సామ్యూల్ జాన్సన్

కల్తీ లేని ఆహరం

తల్లిపాలు :

ప్రపంచం లో కల్తీ లేని ఏకైక ఆహరం తల్లిపాలు మాత్రమే. ఇది బిడ్డకు పకృతి ప్రసాదించిన వరం.

పోషక విలువలు :
  • శక్తి 65 కేలరీలు
  • పిండి పదార్థాలు 1.1  గ్రాములు
  • కాల్షియం 28 మిల్లీ గ్రాములు
  • ఫాస్పరస్ 11 మిల్లీ గ్రాములు
  • సి-విటమిన్ 3 మిల్లి గ్రాములు, 
  • బి 2 విటమిన్ 20 మైక్రోగ్రాములు
  • ఏ-విటమిన్ 42 మైక్రోగ్రాములు. 
లాభాలు :
  • తల్లిపాలు మాత్రమే తాగే పిల్లల్లో విరేచనాలు, అజీర్తి వంటివి తలెత్తవు. 
  • తెలివితేటలు అపారంగా పెరుగుతాయి. 
  • శరీర పెరుగుదల, ఎముకలు, పళ్ళు తయారీకి అవసరమయ్యే పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. 
  • దవడలు, పళ్ళు,బుగ్గలు సరైన రీతిలో పెరుగుతూ  ముఖం చూడటానికి క్రమపద్ధతిలో కనిపిస్తూ అందంగా ఉంటుంది 
  • కీళ్ల ఎముకలు కూడా త్వరగా అరిగిపోవు. 
  • విరేచనాలు మరియు న్యూమోనియా మరణాలు అరికట్టబడతాయి. 
  • పోలియో, పొంగు వ్యాధులను నిరోధించే ఏంటిబాడిన్ ఉంటాయి. 
  • ఎటువంటి ఇబ్బంది లేకుండా బిడ్డకు కావాల్సిన సహజ ఉష్ణోగ్రత లో సహజంగా, తాజాగా, పరిశుభ్రంగా ఇవ్వబడతాయి. 
  • ఇందులో లాక్టాల్బమిన్ ఎక్కువగా ఉండటం వలన త్వరగా జీర్ణమవుతుంది. 

Sunday, 4 September 2016

నీ చరణం శరణం వినాయక


వినాయకుడు అంటే విశేషమైన గుణగణాలు ఉన్నవాడని అర్థం ఉంది. తనకు పైన ఇంకో నాయకుడు లేడన్నది మరో అర్థం. భూతగణాలకి అధిపతి గణపతి.

ఏకదంతుడు : వినాయకుడు తన రెండు దంతాలతో ఒక దాన్ని విరిచి, దాన్ని కలంగా ఉపయోగించి వ్యాస మహర్షి చెప్పిన 'మహా భారత కథ" ని రాసి మనకి అందించాడని ప్రతీతి.
ఏ ఆయుధం వల్ల మరణం రాకూడదని బ్రహ్మ వరం పొందిన ఒక రాక్షసుడ్ని చంపటం కోసం తన దంతాన్ని విరిచి దాంతో రాక్షససంహారం చేశాడని కొన్ని పురాణాలు చెప్తాయి.

ఈ విధంగా ఏకదంతుడు అనే పేరు వచ్చింది.

గరికె విశిష్టత :  అనలాసురుడనే రాక్షసుడ్ని గణపతి చంపిన తరువాత తన శరీరంలో రగిలిన వేడిని తగ్గించడం కోసం గరికె గడ్డిని తలపై ఉంచాడు. గరికె చేసిన సహాయానికి తనను గరికె తో పూజించిన వారికీ ఎటువంటి రోగాలు రావని వరమిస్తాడు. ఈ గరికె మూలికా గుణాలు కలది, దీని గడ్డి రసాన్ని తాగితే చక్కెర వ్యాధి నయమవుతుందట.

గుంజిలంటే ఇష్టం : తన భక్తులు తనముందు గుంజీలు తీస్తే వినాయకుడికి ఇష్టమట, అవి తీసేపుడు తలనుంచి కాళ్ళ వరకు నరాలు బాగా పనిచేసి మెదడుకి కావాల్సిన బలం చేకూరుతుంది. మనస్సుకి ప్రశాంతత లభిస్తుంది. గుంజీలు తీయటం వెనుక అర్థం ఇదే.
వినాయకుడికి చేసే ప్రతి పనిలో, ప్రతి పూజ లో ఎన్నో ఆరోగ్య సూత్రాలున్నాయి అన్నది నిజం.

(Sep 5th - వినాయక చవితి సందర్భంగా ఈ వ్యాసం)


బొజ్జ గణపయ్య దివ్య రూపాలు



శ్రీ విజయగణపతి : మూషిక వాహనం పై దర్శనం ఇస్తూ కష్టాలని, ఆపదల్ని, విఘ్నాల్ని నివారించి సుఖసంతోషాలు ప్రసాదిస్తాడు.

శ్రీ శక్తి గణపతి :    వల్లభి అనే శక్తిని ధరించిన ఈ గణపతి మనలోని భయాల్ని, సంకుచిత భావాల్ని తరిమేస్తాడన్నది  నిజం.

శ్రీ హేరంబ గణపతి : ఐదు ముఖాలు కలిగి తెల్లని మంచు లాంటి శరీరం కలిగి చేతుల్లో పాశాంకుశం, కొడారి, చక్రం, ఉండ్రాళ్ళు, విరిగిన దంతము, రుద్రాక్షమాల కలిగి సింహవాహన రూపుడై పాదాల్ని తాకి శరణు కోరిన వారికీ అభయమిచ్చి వారి ఆపదల్ని పారద్రోలగల సమర్థుడు.

Saturday, 3 September 2016

Podupu Kathalu

పొడుపు కథలు

  1. అన్ని దేశాలకు ఇద్దరే రాజులు
  2. అందరాని వస్త్రం పై అన్ని వడియాలే 
  3. అంగుళం ఆకు, అడుగున్నర కాయ 
  4. కారుగానికారు - పరుగులో మహాజోరు
  5. కోస్తే తెగదు, కొడితే పగలదు 
  6. ఒళ్ళంతా ముళ్ళు, కడుపంతా చేదు
  7. కన్ను ఉన్నా తల లేనిది
  8. కాళ్ళున్నా పాదాలు లేనిది
  9. ఒక అగ్గిపెట్టెలో ఇద్దరు పోలీసులు
  10. ఇళ్ళు లేని పట్నాలు, నీళ్లు లేని సముద్రాలు
         సమాధానాలు తరువాత పేజీ లో .. (Click read more)

safety(సేఫ్టీ) అలర్ట్


రాత్రి సమయంలో మీరు కారులో వెళ్తుండగా మీకారు అద్దంపై కోడిగుడ్డు పడితే, ఎట్టి పరిస్తితుల్లోను మీరు కారు ఆపవద్దు..అంతేకాక వైపర్ ఆన్ చేయకూడదు. వైపర్ ఆన్ చేసి నీటితోకారు గ్లాసు (అద్దం) శుభ్రం చేయాలని ప్రయత్నిస్తే నీటితొ కోడిగుడ్డులోని రసాయనాలు కలయొకతో అద్దంపై నల్లటి పొర ఏర్పడి అంతా చీకటిగా తయారయి బయట ఏమీ కనబడదు. అప్పుడు తప్పనిసరిగా  కారు  ఆపవలసి వస్తుంది. ఆ వెంటనే దారిదొపిడీ దొంగలు మీ మీద దాడి చేసి మీ విలువైన వస్తువులు, నగదు దోపిడీ చేసే అవకాశం వుంది. కావున జాగ్రత్త !!

Friday, 2 September 2016

Meeku telusa ..?


  1. బార్బీ బొమ్మ పూర్తి పేరు బార్బరా మిల్లిసెంట్ రాబర్ట్స్. 
  2. మగవారి కంటే ఆడవారు రెట్టింపుగా వణుకుతారట. 
  3. మనంతట మనం శ్వాసను నిలిపేసుకొని ఆత్మహత్య చేసుకోలేం. 
  4. మనిషి కండరాలలో ముక్కు అత్యంత గట్టి కండరం అంటే నమ్ముతారా?
  5. ప్రతి ఖండంలో రోమ్ అన్నపేరుతో ఒక సిటీ ఉందని తెలుసా?

Thursday, 1 September 2016

మీ కోసం ...!!


 పెరుగు తినటం వల్ల 

చలికాలంలో సాయంకాలం పెరుగు తినటం వలన కఫము పెరుగుతుందనో లేక మరేదైనా సమస్య రావచ్చని చాలామంది భావిస్తారు. దీనికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు.
        అయితే అప్పటికే ముక్కు కారటం, గోంతు ఛాతిలో కఫము ఉండటం వలన చల్లని పాలు లేదా పెరుగు తీసుకుంటే కొంతవరకు సమస్య పెరగవచ్చునేమో కానీ కొత్తగా అయితే సమస్య రాదు.
        వృత్తి, ఉద్యోగాలలో ఎక్కువ మాట్లాడాల్సి ఉంటే వారు కొంత జాగ్రత్త తీసుకోవాలి.
        ముందు జాగ్రత్తగా సాయంత్రం వేళ చల్లగా ఉండేవాటినో లేదా సిట్రస్ ఫ్లేవర్ గల పానీయాలను తాగకూడదు. సూప్స్,   గ్రీన్ టీ వంటి వెచ్చని పానీయాలు తాగితే రిలీఫ్ గా ఉంటుంది.

తాజాగా ఉండాలి అంటే !!!

కూరగాయలన్నిటిని తెచ్చి తేవగానే ఫ్రిజ్ లో సర్దేయకూడదు. టొమోటోలు,  బంగాళదుంపలు, స్క్వాష్, సిట్రస్ పండ్లు చల్లని  కౌంటరు టాప్ ల పై ఎక్కువరోజులు తాజాగా ఉంటాయి. వాటిని భద్రపరచటానికి  ముందు వాష్ చెయ్యకూడదు. లూజ్ గా రోల్ చేసి ప్లాస్టిక్  బ్యాగ్స్ లో పెట్టాలి కొద్దిగా ఆలివ్ ఆయులు రాయటం వల్ల కూరగాయలు పాడవవు .  రెండు మూడు రోజుల్లో వాడేస్తామనుకుంటే పండ్లను ఫ్రీజ్ లో భద్రపరచాల్సిన అవసరం అంతగా ఉండదు.

Wednesday, 31 August 2016

క్రమశిక్షణ అంటే .....


ఒకే కుటుంబం నుండి వచ్చి ఒకే పాఠశాలలో చదువుకున్న అన్నదమ్ములలో ఒకరు అద్భుతమైన విజయాలను సాధిస్తే మరొకరు సాదాసీదా వ్యక్తిగా ఉండటం చూసే ఉంటారు.
    ఒకే అర్హతతో ఉద్యోగంలో చేరినవారిలో కొందరు సంస్ధలో  ప్రత్యేక గుర్తింపు పొందగా మిగిలినవారు పదిమందిలో ఒకరిగా మిగిలిపోతారు.
   ఒకే తరహా వ్యాపారం ఒకే సమయంలో ప్రారంభించి లాభాలను  ఒకరు ఆర్జిస్తే, సరైన దిశలో నడపలేక మూతవేసుకుంటారు మరొకరు.
   చదువు అయినా, ఉద్యోగం అయినా, వ్యాపారం అయినా, విజయానికి, వెనకపడటానికి కారణం విజయం సాదించినవారిలో ఉన్న క్రమశిక్షణ.
  వెనుకపడిన వారందిరిలో కనిపించే లక్షణం తమ సమయం మీద, పనుల మీద పట్టులేకపోవటం.
  ఉదయం త్వరగా లేచి వ్యాయామం చెయ్యటం చాలామందికి ఇష్టం ఉండదు. "అబ్బా అంత పొద్దున్నే లేవటం నా వల్ల కాదు" అని బద్ధకించేవారు "ఇవాళ కాదులే రేపటినుండి చేద్దాము" అని వాయిదా వేసేవారు ఎన్నటికీ క్రమశిక్షణ కలిగినవారు కాలేరు
"తర్వాత చేద్దాము" అనే పదం నచ్చనివారే విజేతలవుతారు.
ఉదయం లేచి వ్యాయామం చేయకపోతే అనారోగ్యమని తెలుసు, వ్యాపారంలో ఎప్పటి లెక్కలు అప్పుడు చూసుకోకపోతే నష్టమొస్తుందని తెలుసు. అయినా వాయిదా వేస్తారు, విఫలమౌతారు. విజేతలు ముందుగా తాము ముగించాల్సిన పనులు ముగించాకే వేరే  విషయాలపై శ్రద్ద పెడతారు.
లక్ష్యసాధనకు కృషి, స్వీయ క్రమశిక్షణ ఒక్కరోజులో అలవరచుకునేది కాదు.ఇది సాధనతో సాధించాల్సినది.
లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు దానిని అందుకునే కోరిక ఉన్నప్పుడు దృష్టి మరల్చే అంశాలను పక్కనపెట్టి ముందుకు పరుగు తీయటం సులభమవుతుంది.
ఆలోచనలను నియంత్రించటం కూడా స్వీయ క్రమశిక్షణ లో భాగమే. చేసే ప్రతిపనికి మూలం ఆలోచనలే. అవే మనిషిని అటు ఇటు తీసుకెళ్ళ్తాయి.అవి మనసును గందరగోళం చేయకుండా లక్ష్యము మీదకి మళ్లించే సాధన చేయాలి. స్వీయ క్రమశిక్షణలో దానిని మొదలుపెట్టటమే. దీనికోసం ప్రత్యేకంగా ఒకరోజు కోసం ఎదురుచూడనక్కర్లేదూ. ఇలా తట్టింది ఆలా అమలు చేసి మేలు పొందగలిగిన మార్గం తెలిసినప్పుడు ఇంకా ఎందుకు ఎదురుచూడటం?

త్వరపడక తప్పదు మరి.. అవునంటారా ...?????



Tuesday, 30 August 2016

స్పూర్తి .....

ఒక బాలిక భగవంతుణ్ణి ప్రార్ధించాలనుకుంది. కానీ ప్రార్ధించటం ఎలాగో  తెలియదు.

స్తోత్రాలూ పలుకుతూ , గీతాలు పాడుతూ,  పెద్దలు ప్రార్ధించటం ఆమె ఎన్నోసార్లు చూసింది. కానీ పాపం, ఆమెకు స్తోత్రాలు, పాటలు తెలియవు. అయినప్పటికీ ప్రార్ధించాలి. అప్పుడు తను ఏం చేసిందో తెలుసా? దేవుని విగ్రహం ముందు చేతులు జోడించి నిలబడింది.

అ, ఆ, ఇ, ఈ ....అంటూ వర్ణమాలను క్రమం తప్పకుండ ఉచ్చరించసాగింది. తరువాత హృదయంలో భావోద్వేగాలు పొంగగా
       "ఓ దేవుడా! నాకు స్తోత్రాలు కానీ  గీతాలు కానీ  తెలియవు. నాకు తెలిసిందంతా ఈ అక్షరాలే ! నీకు కావాల్సిన ప్రార్ధన ఈ అక్షరాలా నుండి నువ్వే రూపొందించుకో"   అని విన్నవించుకుంది. 

ఈ బాలిక స్థితి నుండి ఒక సందేశం లభిస్తుంది   !!

ఏదైనా ఒక పనికి పూనుకున్న తర్వాత దానిలోని లోతుపాతులు తెలుస్తాయి. ఎలా ప్రారంభించాలి, ఎలా విశ్లేషించాలి,ఎలా ముగించాలి. ఏది చేయాలి, ఏది వదలాలి, అనే ప్రశ్నలకు మెల్లగా సమాధాన ద్వారాలు ఒకొక్కటి తెరుచుకుంటాయి...

స్ఫూర్తి ఎలా వస్తుంది, ఎవరిస్తారు అన్నది ఒక ప్రశ్న. స్ఫూర్తి ఒక మంచి పుస్తకం కావచ్చు.ఒక మిత్రుడు కావచ్చు , జీవితం లో జరిగిన లేదా విన్న ఏదైనా చిన్న సంఘటన కావచ్చు. అతి చిన్న ప్రాణి చీమ సైతం మనందరికీ స్ఫూర్తిదాయకమే. కొవ్వొత్తి సైతం అజ్ఞానం అనే మైనాన్ని కరిగించి జ్ఞాన జ్యోతిని వెలిగించేదే!!

పరిశీలన , తద్వార ఆలోచన నిరంతర ఉత్సాహాన్ని నిరంతర ఉత్తేజాన్ని నింపుతుంది. చూడగలిగే మనసు , సాధించాలనే తపన ఉండాలే కానీ ఈ సృష్టి అంత స్ఫూర్తిమాయమే !!

ఇది నచ్చినట్లయితే కామెంట్స్ రాయండి...!!