రక్తం శరణం గచ్చామి
ప్రపంచవ్యాప్తంగా వివిధ కారణాలవల్ల రక్తం అవసరమైనవారికి తగినంత దొరకటం లేదు.
రక్తం అవసరాలకు సంబంధించి కొన్ని వాస్తవాలు:
- భారత్ లో ఏటా 1.20 కోట్ల యూనిట్లు రక్తం అవసరమవుతుంటే, రక్తదాతలనుండి సేకరిస్తుంది 90 లక్షల యూనిట్లు మాత్రమే.
- ఒక యూనిట్ రక్తం తో మూడు నిండు ప్రాణాలు కాపాడవచ్చు.
- ఏ గ్రూపు రక్తం ఉన్న వారికైనా 'ఓ' నెగిటివ్ రక్తానికి చెందిన ఎర్ర కణాలను ఎక్కించవచ్చు. ఈ గ్రూపు రక్తానికి డిమాండు ఎక్కువ, దీనికి తీవ్రమైన కొరత ఉంటోంది.
- అన్ని బ్లడ్ గ్రూపు ల వారికీ 'ఏబీ' పాజిటివ్ గ్రూపు వారికీ చెందిన ప్లాస్మాను ఎక్కించవచ్చు. దీనికి కూడా కొరత ఉంటోంది.
- రక్తదానం చేయాలనుకునే వారు రెండు నెలలకి ఒకసారి చేయవచ్చు. ఆరోగ్యానికి ముప్పు ఉండదు.
- కేవలం ప్లేట్ లెట్లు ఇచ్చేవారు వారానికి ఒకసారి ఇవ్వచ్చు.
- పూర్తి ఆరోగ్యంతో ఉండి, 18-65 ఏళ్ల లోపు వారు రక్తదానం చేయవచ్చు.
No comments:
Post a Comment