తల్లిపాలు :
ప్రపంచం లో కల్తీ లేని ఏకైక ఆహరం తల్లిపాలు మాత్రమే. ఇది బిడ్డకు పకృతి ప్రసాదించిన వరం.పోషక విలువలు :
- శక్తి 65 కేలరీలు
- పిండి పదార్థాలు 1.1 గ్రాములు
- కాల్షియం 28 మిల్లీ గ్రాములు
- ఫాస్పరస్ 11 మిల్లీ గ్రాములు
- సి-విటమిన్ 3 మిల్లి గ్రాములు,
- బి 2 విటమిన్ 20 మైక్రోగ్రాములు
- ఏ-విటమిన్ 42 మైక్రోగ్రాములు.
- తల్లిపాలు మాత్రమే తాగే పిల్లల్లో విరేచనాలు, అజీర్తి వంటివి తలెత్తవు.
- తెలివితేటలు అపారంగా పెరుగుతాయి.
- శరీర పెరుగుదల, ఎముకలు, పళ్ళు తయారీకి అవసరమయ్యే పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
- దవడలు, పళ్ళు,బుగ్గలు సరైన రీతిలో పెరుగుతూ ముఖం చూడటానికి క్రమపద్ధతిలో కనిపిస్తూ అందంగా ఉంటుంది
- కీళ్ల ఎముకలు కూడా త్వరగా అరిగిపోవు.
- విరేచనాలు మరియు న్యూమోనియా మరణాలు అరికట్టబడతాయి.
- పోలియో, పొంగు వ్యాధులను నిరోధించే ఏంటిబాడిన్ ఉంటాయి.
- ఎటువంటి ఇబ్బంది లేకుండా బిడ్డకు కావాల్సిన సహజ ఉష్ణోగ్రత లో సహజంగా, తాజాగా, పరిశుభ్రంగా ఇవ్వబడతాయి.
- ఇందులో లాక్టాల్బమిన్ ఎక్కువగా ఉండటం వలన త్వరగా జీర్ణమవుతుంది.