వ్యక్తిగత విజయసిద్ధి (Personality Development)
- జీవితంలో సఫలురయిన చాలామంది స్త్రీ పురుషులు కళాశాలల్లో ఉన్నత విద్యలు అభ్యసించలేదు. వాళ్ళు "జీవితం అన్న పాఠశాల" లో మాత్రమే చదువుకున్నారు.
- మిమ్మల్ని వెనక్కు లాగేది అపజయం కాదు. అపజయం పాలౌతామనే భయమే మిమ్మల్ని నిశ్చేష్టులను చేస్తున్నది.
- జీవితంలో మీకేదైన కావాలనిపిస్తే అది పొందినవాళ్లు దాన్ని ఎలా సాధించారో తెలుసుకోండి. మీరు అలాగే సాధించండి
- విజయానికి కావలసిన అత్యంత ముఖ్యమైన ముడిసరుకు- అపజయం నుంచే విజయం చేకూర్చుకునే మార్గాలు నేర్చుకోగలరు.
- మీ మనస్సు కొత్త ఆలోచనను ఢీకోనప్పుడు మీ జీవితం పూర్తిగా మారిపోతుంది.
- మనస్సులో ఎల్లప్పుడు ఏది కావాలని కోరుకుంటారో, అది మీరు పొందగలరు
- మనశ్శాంతిని మీ అంతిమలక్ష్యంగా పెట్టుకోండి. దానిని సాధించడానికి మీ జీవితాన్ని వ్యవస్తీకరించండి.
- మీ అద్భుతమైన మెదడును మీరు సక్రమంగా ఉపయోగించుకుంటే అది మిమ్మల్ని దరిద్రం నుంచి ఐశ్వర్యంలోకి, ఒంటరితనం నుంచి ప్రఖ్యాతికీ, నిరాశ నిస్పృహల నుంచి ఆనందమయ జీవనానికి తీసుకోని వెళ్లగలదు.
- ఒకే సమయం లో ఒకే విషయం పట్ల ఏకాగ్రత సాధించగల మీ సమర్ధతపై మీ విజయం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.
- మీ మెదడును ఉపయోగించే రీతివల్ల అది మిమ్మల్ని పేదగానో లేదా ధనికుడినో చేస్తుంది.