శ్రీ విజయగణపతి : మూషిక వాహనం పై దర్శనం ఇస్తూ కష్టాలని, ఆపదల్ని, విఘ్నాల్ని నివారించి సుఖసంతోషాలు ప్రసాదిస్తాడు.
శ్రీ శక్తి గణపతి : వల్లభి అనే శక్తిని ధరించిన ఈ గణపతి మనలోని భయాల్ని, సంకుచిత భావాల్ని తరిమేస్తాడన్నది నిజం.
శ్రీ హేరంబ గణపతి : ఐదు ముఖాలు కలిగి తెల్లని మంచు లాంటి శరీరం కలిగి చేతుల్లో పాశాంకుశం, కొడారి, చక్రం, ఉండ్రాళ్ళు, విరిగిన దంతము, రుద్రాక్షమాల కలిగి సింహవాహన రూపుడై పాదాల్ని తాకి శరణు కోరిన వారికీ అభయమిచ్చి వారి ఆపదల్ని పారద్రోలగల సమర్థుడు.