Sunday, 4 September 2016

బొజ్జ గణపయ్య దివ్య రూపాలు



శ్రీ విజయగణపతి : మూషిక వాహనం పై దర్శనం ఇస్తూ కష్టాలని, ఆపదల్ని, విఘ్నాల్ని నివారించి సుఖసంతోషాలు ప్రసాదిస్తాడు.

శ్రీ శక్తి గణపతి :    వల్లభి అనే శక్తిని ధరించిన ఈ గణపతి మనలోని భయాల్ని, సంకుచిత భావాల్ని తరిమేస్తాడన్నది  నిజం.

శ్రీ హేరంబ గణపతి : ఐదు ముఖాలు కలిగి తెల్లని మంచు లాంటి శరీరం కలిగి చేతుల్లో పాశాంకుశం, కొడారి, చక్రం, ఉండ్రాళ్ళు, విరిగిన దంతము, రుద్రాక్షమాల కలిగి సింహవాహన రూపుడై పాదాల్ని తాకి శరణు కోరిన వారికీ అభయమిచ్చి వారి ఆపదల్ని పారద్రోలగల సమర్థుడు.



శ్రీ ఉత్తిష్ఠ గణపతి : చేతుల్లో వీణ, రుద్రాక్షమాల, తామర పుష్పమ్ మొదలైన వాటిని ధరించి సంగీత జ్ఞానాన్ని, స్వరమాధుర్యాన్ని ప్రసాదిస్తాడు.

శ్రీ క్షిప్ర గణపతి : చేతుల్లో చెరకుగడ, రుద్రాక్షమాల కలిగి కోరిన వరాల్ని వెంటనే తీర్చి భక్తుల్ని ఆనందసాగరంలో ముంచేవాడని అర్థం.

శ్రీ వీర  గణపతి  : చేతుల్లో విల్లు, బాణం, చక్రం, కత్తి, కొడారి, నాగపాశం, త్రిశూలం వంటి ఆయుధాల్ని కలిగి సమాజంలోని చెడుని తొలిగించి మంచిని పెంపొందించేవాడు శ్రీ వీర గణపతి.

శ్రీ బాల గణపతి :  కళ్ళకి అధిపతి పూలమాల ధరించి చేతిలో అరటిపండు, మామిడి పండు, పనస పండు, చెరకు, ఉండ్రాళ్ళు కలిగి ఉంటాడు. ఎడారిని కూడా పచ్చదనంతో నింపి జ్ఞానం ఇవ్వడంలో సిద్ధహస్తుడు.

No comments:

Post a Comment