ఒక బాలిక భగవంతుణ్ణి ప్రార్ధించాలనుకుంది. కానీ ప్రార్ధించటం ఎలాగో తెలియదు.
స్తోత్రాలూ పలుకుతూ , గీతాలు పాడుతూ, పెద్దలు ప్రార్ధించటం ఆమె ఎన్నోసార్లు చూసింది. కానీ పాపం, ఆమెకు స్తోత్రాలు, పాటలు తెలియవు. అయినప్పటికీ ప్రార్ధించాలి. అప్పుడు తను ఏం చేసిందో తెలుసా? దేవుని విగ్రహం ముందు చేతులు జోడించి నిలబడింది.
అ, ఆ, ఇ, ఈ ....అంటూ వర్ణమాలను క్రమం తప్పకుండ ఉచ్చరించసాగింది. తరువాత హృదయంలో భావోద్వేగాలు పొంగగా
"ఓ దేవుడా! నాకు స్తోత్రాలు కానీ గీతాలు కానీ తెలియవు. నాకు తెలిసిందంతా ఈ అక్షరాలే ! నీకు కావాల్సిన ప్రార్ధన ఈ అక్షరాలా నుండి నువ్వే రూపొందించుకో" అని విన్నవించుకుంది.
ఈ బాలిక స్థితి నుండి ఒక సందేశం లభిస్తుంది !!
ఏదైనా ఒక పనికి పూనుకున్న తర్వాత దానిలోని లోతుపాతులు తెలుస్తాయి. ఎలా ప్రారంభించాలి, ఎలా విశ్లేషించాలి,ఎలా ముగించాలి. ఏది చేయాలి, ఏది వదలాలి, అనే ప్రశ్నలకు మెల్లగా సమాధాన ద్వారాలు ఒకొక్కటి తెరుచుకుంటాయి...
స్ఫూర్తి ఎలా వస్తుంది, ఎవరిస్తారు అన్నది ఒక ప్రశ్న. స్ఫూర్తి ఒక మంచి పుస్తకం కావచ్చు.ఒక మిత్రుడు కావచ్చు , జీవితం లో జరిగిన లేదా విన్న ఏదైనా చిన్న సంఘటన కావచ్చు. అతి చిన్న ప్రాణి చీమ సైతం మనందరికీ స్ఫూర్తిదాయకమే. కొవ్వొత్తి సైతం అజ్ఞానం అనే మైనాన్ని కరిగించి జ్ఞాన జ్యోతిని వెలిగించేదే!!
పరిశీలన , తద్వార ఆలోచన నిరంతర ఉత్సాహాన్ని నిరంతర ఉత్తేజాన్ని నింపుతుంది. చూడగలిగే మనసు , సాధించాలనే తపన ఉండాలే కానీ ఈ సృష్టి అంత స్ఫూర్తిమాయమే !!
ఇది నచ్చినట్లయితే కామెంట్స్ రాయండి...!!
Very good story
ReplyDelete